Wednesday, June 24, 2009

ప్రతి ఆలోచనకి వెనక ఒక మహా సముద్రం

ఏ అలోచనైనా మనకి తట్టినప్పుడు ఒక్క క్షణం మనం ఓపికగా నిలబడి దాన్ని ఏ అపేక్షా, దృక్పథమూ లేకుండా నిర్లిప్తతతో దాని బయట నిలబడి చూడగలిగితే, మన అస్తిత్వమే లేని ఒక పరమావధిలో, నేనూ ఇతరం అనే విభేదం లేని చైతన్యంలో ఉండి పోతాం. ఈ విధంగా అ ప్రమేయంగా ఉండడానికి మనం క్షణికంగానైనా సర్వాన్నీ త్యజించగలగాలి: ముఖ్యంగా మన మనోభావాల్నీ, కోర్కెల్నీ, భయాల్నీ, అన్నింటినీ వదులుకోవాలి. ఇది అంత సులభంగా జరిగేది కాదు. కాని ఇది సాధ్యం. అయితే దీని వల్ల ఏ ప్రయోజనం ఉంటుందని నేనడం లేదు. ఆ క్షణంలోనైనా మనసుకి సంపూర్ణమైన శాంతి కలుగుతుంది. ఈ విషయాన్ని ప్రయోగించి చూడండి.

1 Comments:

Blogger గీతాచార్య said...

Welcome to the blogOsphere.

Have a nice journey sir.

June 24, 2009 at 9:01 PM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home