ఒక చిన్న ప్రకటన:
ఇన్నాళ్ళూ నిశ్శబ్దంగా ఉండడానికి కారణం ఇతర వ్యాపకాల్లో ముణిగి ఉండడమే. ముఖ్యంగా ’ధ్యానం మీద ఆలోచనలు’ 'Reflections on Meditation' అనే శీర్షిక కింద ఒక వ్యాసం రాయడం. దాన్ని ఇప్పుడే పూర్తి చేసి నా ఇంగ్లీషు బ్లాగులో వేశాను. మీకు ఇంగ్లషులో చదవడానిక వీలుంటే http://moortysblogpage.blogspot.com లో చదువుకోండి. తెలుగులోకంటే ఇంగ్లీషులో రాయడం నాకు సులువు హెచ్చు కనుక ముందర ఆ భాషలో రాస్తున్నాను. కాలక్రమేణా తెలుగు బ్లాగులో కూడా ఇలాంటి విషయాల గురించి రాస్తూనే ఉంటాను.
3 Comments:
తప్పకుండా వ్రాయండి. ఆధ్యాత్మికత గురించీ, ధ్యానం మరియు యోగ వంటి అమూల్యమైన సంపద గురించి విదేశీయులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. వాటిని సామాన్య భారతీయులకు మరింత దగ్గర చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి మీవంటి పెద్దలే దారి చూపాలి.
నమస్కారమండీ! మీ వ్రాతల కోసం ఎదురు చూస్తుంటాను.
సర్, మీ బ్లాగుని నిశ్శబ్దంగా చదువుకుని ఆనందించేవాళ్ళలో నేనొకణ్ణి. నాలాంటివాళ్ళు అనేకమంది ఉన్నారని నాకో గట్టి నమ్మకం. అయితే మీ బ్లాగులో వివరమైన కామెంట్లు రాద్దామని ఎప్పుడో అనుకున్నా, రాయలేదు. మీవంటి శిఖరసమానులైన వ్యక్తుల బ్లాగులో ఏమైనా రాయాలన్నా కొంచం భయమేస్తుంది, మన అజ్ఞానం బయటపడుతుందని. అందుకే బహుశా మీరు రాసిన అద్భుతమైన వ్యాసాలకి రావలసినంత స్పందన రాలేదని అనిపిస్తుంది. మీరు రాయదలచుకున్న వ్యాసం శీర్షిక నాకూ, నాలాగే బాధపడే అనేకమందికీ ఎంతగానో ఉపయోగపడుతుందని అనిపిస్తోంది. (నా బ్లాగులో సరికొత్తగా రాసిన టపా చూడండి, వీలైతే). దయచేసి తప్పకుండా మీ వ్యాసాన్ని తొందరలో రాయండి.
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home