Saturday, May 24, 2008

’అధ్యాత్మికత’ అంటే ఏమిటి:

నా వ్యాసానికి కామెంటుగా ఒక చదువరి (anonymous) ఈ క్రింద ప్రశ్న అడిగారు:

"Being a philosophy teacher and UG's friend could you please explian / define spirituality."

దానికి నా సమాధానం:

'Spirituality' (ఆధ్యాత్మికత) ని ఎలా నిర్వచిస్తానో చెప్పమన్నారు: ఈ పదాన్ని రకరకాల వారూ రకరకాలుగా వాడతారు: సాధారణంగా, భౌతిక విషయాల మీద అంతగా ఆసక్తి చూపక, దైనందిన కృత్యాలకూ, గమ్యాలకూ అతీతంగా జీవితానికి వేరే అర్ధం ఉన్నదనీ, దాన్ని గ్రహించి సాక్షాత్కారం చేసుకోవాలనీ, దానికి అనుగుణంగా జీవితాన్ని సాగించుకొని సార్ధకం చేసుకోవాలనీ, అంతకన్నా ముఖ్యంగా మన స్వస్వరూపం ఏమిటో, ’నేను’ అనేది ఏమిటో తెలుసుకోవాలనుకోవాలనే ఆసక్తి చూపడం. ఇలాంటి ఆసక్తిని వివిధ మతానుయాయులు వారివారి మత విశ్వాసాలతో జోడించుకుంటారు: ఉదాహరణకు, ఆత్మ, పరమాత్మ, పునర్జన్మ, దైవము, కర్మ, ప్రార్ధన, ధ్యానము లాంటివి.

నాకు మత సంబంధమైన నమ్మకాలేవీ లేవు. అయినా నేను కూడా ఒక్కొక్కప్పుడు ఆ పదాన్ని ఉపయోగిస్తూంటాను. ’నేను’ అనేది ఎవరు అనే అన్వేషణే ఆధ్యాత్మికత అని నా ఉద్దేశ్యం. ఈ అన్వేషణలో నాకు తెలిసింది తెలియనిదాన్నించి విడతీసి, తెలిసిన దాంతోనే నా అన్వేషణని చెయ్యడానికి ప్రయత్నిస్తాను. ఈ విధంగా కలిగే జ్ఞానం వల్ల మన జీవితంలో ఒక పరిణామం వచ్చి, మనం జీవితంతో సమాధాన పడగలమని అనుకుంటాను. ఈ సందర్భంలోనే జీవితానికి సంబంధించిన ఇలాటి అన్ని విషయాలమీదానా, ఉదాహరణకి, వాంచలూ భయాల్ని గురించీ, పరస్పర సంబధాల గురించీ, నైతికి విషయాలకు కూడా నా అన్వేషణ వ్యాపిస్తుంది. నాకు తత్త్వ శాస్త్రంతో ఉన్న పరిచయం ప్రాతిపదికగా నేను జిడ్డు కృష్ణమూర్తి దగ్గర్నించీ, యూజీ దగ్గర్నించీ నేర్చుకున్న విషయాలు నాకు చాతనైన విధంగా, తోచిన విధంగా ఈ వ్యాసాల్లో విశదం చెయ్యడమే నా యత్నం. ఇలాంటి అన్వేషణనే మీరు ధ్యానం అనుకుంటే నాకు అభ్యంతరం లేదు.

వచ్చే వ్యాసాల్లో జీవితం అర్ధం, నీతి, ధ్యానం చెయ్యడంలో సమస్యలు లాంటి శీర్షికలకింద వ్యాసాలు రాయాలని ఉద్దేశిస్తున్నాను.

5 Comments:

Blogger GIREESH K. said...

ఆధ్యాత్మికత - ఎంతో కాలంపాటు, ఎన్నో మేధస్సులను తొలచిన ప్రశ్న.... చాల చక్కగా విపులీకరించారు. నా నమస్సులు.

నా దృష్టిలో - లొంగని జీవిత విరుద్ధాలలో విచలితమవకుండా, ఆందోళన, అలజడి లేకుండా ఉండగలిగే సామర్ధ్యమే ఆధ్యాత్మికత. అర్ధమయినా, కాకపోయినా, జరిగేదంతా మన మంచికే అని విశ్వసించగలిగే మానసిక సంసిద్ధతే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే సమస్యల నుంచి స్వేచ్చ కాదు. వాటిని తట్టుకునే స్థైర్యం. క్షణికానందాలను శస్వతం చేసే కళ. ఆద్యాత్మికత మొగ్గ తొడుగుతుందనడానికి తొలి చిహ్నం - పిర్యాదులు లేకపోవడం.

May 24, 2008 at 10:46 AM  
Anonymous Anonymous said...

Thank you so much. Could you please share UG’s influence on you? I mean how UG changed your point of views or how you UG clarified your inherent doubts. If possible discuss / write your opinion on Jnana, Bhakti, Karma and Dhyana yogas in day to day life.
Thanks in advance.

May 24, 2008 at 11:38 AM  
Anonymous Anonymous said...

Narayana Moorty Garu,
Though it is not related to your topic but I am pasting this URL here. I felt these topics are scientific expalnations of UG's teachings. I read Mukund Rao's first book on UG. These topics are also on those lines.

Topic
Toward the First Revolution in the Mind Sciences by Allan Walace
http://video.google.com.au/videoplay?docid=983112177262602885&q=Allan+wallace&ei=yc5LSMK0IZOuwgOQwdCiBA

Bruce Lipton - The New Biology - Where Mind and Matter Meet 1of 2
http://video.google.com/videoplay?docid=-8506668136396723343&q=Bruce+lipton&ei=NVVNSPyNNo22wgPojoGzBg

June 9, 2008 at 9:45 AM  
Anonymous Anonymous said...

Narayana Moorty sir,
Include your web site link http://home.pacbell.net/moorty/
in your english and telugu blogs first page next to your photo.

It will be convienient for readers to see your works. I spent lot of time searching in your blogs later I got it from google.

Regds,

June 10, 2008 at 12:33 PM  
Blogger Narayana Moorty said...

The links to my home page and a few others are posted on the home page under my picture. But they are not being carried through in other pages. I will figure a way and do it. Thanks for your input.

June 11, 2008 at 6:01 PM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home