Sunday, May 18, 2008

ఆత్మ విద్య, ఆత్మ జ్ఞానం:

ఈ మాటలకి అర్ఢం వేదాంతంలో చెప్పేలాగా కాకుండా, లౌకికంగా అర్ధం చెప్పుకుందాం. మనని గురించి మనం తెలుసుకోవడమన్నమాట. ఉపనిషత్తుల్లో చెప్పే ఆత్మ విద్య దీనికీ ఒక సామ్యత ఉన్నది -- అదేమిటంటే సాధారణ ప్రపంచజ్ఞానానికి భిన్నంగా ఈ జ్ఞానానికి గల విశేష లక్షణం అది కలగడం వల్ల మనలోనే మార్పు అప్రయత్నంగా కలుగుతుంది. ఉదాహరణకు, మనం ఎంతగానో విశ్వసిస్తూ, ఆధారపడే వ్యక్తికి మనమీద వాస్తవంగా అంత ఆసక్తిగానీ ప్రేమగానీ లేవనీ, అతని మీద పెట్టుకున్న భరోసా అంతా వ్యర్ధమేననీ గ్రహింపుకి వచ్చిన వెంటనే ఆ వ్యక్తి నించి దూరంగా జరిగిపోతాం. ఒకరి మీద ఎంతో ప్రేమ అనుకుంటూ ఆమె వెనక వేళ్ళాడుతూ తిరుగుతున్నా, ఆ ప్రేమ సఫలంకాక తాను సంక్షోభంలో ఉన్న సమయంలో ఒక్క క్షణం ఆప్రేమంతా కేవలం ఆధారపడడమేననీ, ఎవరో ఒకరు తనను ప్రేమిచాలనుకోవడం ఉత్త భ్రమేననీ, మనసుకు పట్టిన పిచ్చేననీ స్పష్టంగా అనిపించిందా, ఆ సంక్షోభం అంతా ఒక్క నిమిషంలో మాయమయిపోతుంద్. ఆ జ్ఞానం మనలో అప్రయత్నంగానే మార్పును తెస్తుంది. అలాంటి మార్పు అవగాహనమీద ఆధారపడి ఉంటుంది. నేను ఇక్కడ ప్రస్తావించే జ్ఞానం అలాంటిది. ఇలాంటి జ్ఞానానికి అవధి ఏదో ఒక ప్రస్తుత సమస్యా పరిష్కారం కావొచ్చు, మన మానసిక జీవితం మొత్తం పెల్లగిలిపోయి జీవితానికి పునాదులే లేకపోవడం కావొచ్చు. చివరికి అంతా భీభత్సం అయినట్టు అనిపించినా దానివల్ల జీవితానికి హాని ఉండదు; జీవితం మరో విధంగా నడుచుకుంటుంది, అంతే. ఆత్మ జ్ఞానానికి ముఖమైన పర్యవసానం ఆత్మ విమోచన. ఆ పర్యవసానం దృష్ట్యా చూస్తే, ఆ గమ్యానికి చేర్చగలిగితే నమ్మకానికీ, అనుమానానికీ, సత్యానికి పెద్ద తేడాలుండవు.

ఈ సందర్భంలో ఒక ప్రశ్న ఉదయించక తప్పదు: అయితే జీవితానికి నిశ్చితమైన ఒక ఆధారం అంటూ ఉండదా అని. జీవితానికి వేరే ఆధారం అవసరం లేదు. దానికి అదే ఆధారం. జీవితానికి రెండే రెండు ధ్యేయాలంటారు యూజీ: బ్రతుకు తెరువు (survival), సంతానోత్పత్తి (reproduction). తక్కిన ధ్యేయాలన్నీ మనం మన ఆలోచనాప్రవృత్తి ద్వారా తెచ్చిపెట్టుకున్నవే నంటారు.

* * *

3 Comments:

Blogger pruthviraj said...

నా దృష్టి లో ఆత్మజ్ఞానం అంటే జీవన్ముక్తి కి, అంతరంగికంగా మనిషి నడువవలిసిన సరియైన దారి.అది పరమాత్మ కు దగ్గరగా మనల్ని పరోక్షంగా చేర్చవచ్చు, ఆత్మ సంతృప్తి ని కలుగ జేయవచ్చు.పరిపూర్ణ ప్రపంచజ్ఞానాని కలుగజేయవచ్చు. మీ టాపిక్ నాకు నచ్చింది. మరింత జ్ఞానార్జన కు తోడ్పడాలని ఆశిస్తున్నాను.

May 18, 2008 at 10:40 PM  
Blogger pruthviraj said...

meeru kasta word verification nu toligiste baavuntundi.

May 18, 2008 at 10:41 PM  
Blogger Narayana Moorty said...

వర్డ్ వెరిఫికేషన్ అంటే ఏమిటో నాకు అర్ధం కావడం లేదు. అది తొలగించడమేమిటి? కొంచెం చెప్తారా?

May 19, 2008 at 3:48 PM  

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home