కొన్ని అనుభూతులు:
ఈ రచనలు ఎందూ చేస్తున్నాను అనే ప్రశ్న నాకు అప్పుడప్పుడు కలుగుతూనే ఉంటుంది. యూజీ అన్నమాటలు గుర్తుకొస్తూనే ఉంటాయి: "నువ్వు రాస్తూన్నదానివల్ల ఇతరులకు ఏదో ప్రయోజనం కలుగుతుందని భ్రమించకు." ఈ రాతల్లో కొంత అహం ఉండే ఉండాలి -- కొంత ఆత్మ శ్లాఘనంతో కలిసి. మరో భ్రమేమిటంటే, నేను రాసేదేమీ ఇతరులకు మార్గదర్శకం కాకపోయినా, కనీసం వినోదంగాగానీ, ఔత్సుక్యాన్ని తృప్తి పరచుకోవడానికిగాని ఉపయోగపడుతుందని. కాకపోతే దీనివల్ల పనిలేక రెటైరై ఊరికే కూర్చున్నవాడికి నాకు ఏదో వ్యాపకం కలుగుతుంది. ఏది ఎమైతేనేం, రాస్తూనే ఉంటాను.
* * *
ఇక్కడ నాజీవితంలో జ్ఞాపకాలుగా మిగిలిపోయిన కొద్ది అనుభూతుల్ని పేర్కొంటాను. వాటి కారణంగా వొచ్చిన చిక్కుల్నీ, ఆ చిక్కుల్ని ఏవిధంగా విడతీసుకున్నానో కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను.
మొట్టమొదటిసారిగా నా విషయంలో నాకు కలిగిన అనుభవమిది: సుమారు 12, 13 సంవత్సరాల వయసుంటుంది. విజయవాడలో గాంధీనగరం సత్యనారాయణపురం రోడ్డుమీద నడిచి వెళ్తున్నాను. కొంచం మగతగా నిద్ర వస్తూన్నట్టుగా అనిపించింది. అయితే ఆనిద్ర ఏదో నన్ను అవరించుకుంటూ వచ్చే అల లాగా అనిపించింది. అప్పుడు నిజంగా నిద్ర రావడానికి ముందు స్థితి ఇలాంటిదీ అని నాకు అర్ధమయ్యింది. అప్పటినించీ ఈనాటివరకూ కొనసాగే నా అంతర్వీక్షణానికి (introspection)అదే మొదలు. అంతకు పూర్వం కొద్దిగా అప్పుడప్పుడు ఆత్మ సవెదన (self-consciousness) ఉండేది -- ఉదాహరణకు ఎవరైనా నన్ను పొగిడినప్పుడైనా, నేను ఏ విషయంలోనైనా నిరాశ పొందినప్పుడైనా.
ఒకసారి 1956-57 ప్రాంతాల్లో మద్రాసులో మౌంట్ రోడ్డు మీదనో మరోచోటనో నడుస్తున్నాను: హఠాత్తుగా మనసులోనించి తెర తెరుచుకున్నట్టయింది. నా ముందున్న ప్రపంచాన్ని జీవితంలో మొదటిసారిగా యథతథంగా చూస్తున్నాని అనిపించింది. మామూలుగా మనం ప్రపంచాన్ని గత స్మృతుల ప్రభావం ద్వారానూ, అలోచనలూ, ఉద్రేకాల అభ్యంతరాల ద్వారానూ చూస్తాం. వీటినే నేను తెర అనేది. ఆ ఒక్క క్షణంసేపూ ఆ తెర లేకుండా ప్రపంచాన్ని చూడ్డం చాలా విచిత్రంగా అనిపించింది. అయితే అది ఎంతో సేపు మిగల లేదు.
1962-64 సంవత్సరాల మధ్యలో బర్కిలీ కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రాంగణంలో యూకలిప్టస్ తోపు ప్రక్క ఉన్న రోడ్డుమీద పెద్ద వృక్షం కింద నడుస్తూన్నప్పుడు, మరొకసారి ఇలాంటిదే జరిగింది. ఆ వృక్షమూ, రోడ్డూ పరిసరాలూ మరింత స్పష్టంగా కనిపించిడమేకాక ఆ క్షణానికి నా మనసులో బరువంతా ఒక్కసారి తీసేసినట్టయి మనసంతా ఎంతో తేలికయింది.
1965 లో కాబోలు, నా జీవితంలో జరిగిన సంక్షోభం గురించి పైన రాశాను. దాన్నించి విముక్తి అయిన మర్నాడే ఎందుకనో బర్కిలీనించి సాంఫ్రాన్సిస్కోకు బస్సుమీద వెళ్తున్నాను. మనసు ఇంకా తేలిగ్గా ఉల్లాసంగా ఉంది. అప్పుడు నా మనస్సులో ఇలాంటి దృశ్యం అవుపించింది: నేను ఏదో ఓడలో పొతున్నట్టూ (అంతకుముందు నేనెప్పుడూ ఓడమిద ప్రయాణం చెయ్యలేదు -- దానికి మూలం నా గతంలో మరేడో అయుండాలి), దాని గోడపైనున్న గుండ్రపు అద్దంకుండా బయట ప్రపంచాన్ని మొదటిసారిగా చూసినట్టూ. అనంతంగా కనబడే అ విశాలతనూ, అంత తెరిపినీ భయంతో నేను భరించలేకపోయి ఆకిటికీని తటాలున మూసేశాను, "అమ్మబాబోయ్, అంత విశాలత్వంలోకి వెళ్ళేందుకు నా కంత ధైర్యం ఇంకా లేదు," అనుకుంటూ. సర్వాన్ని పరిత్యజించి పూర్తి బయలులోకి వెళ్ళేందుకు నేను ఇంకా సిద్ధంగా లేననిపించింది.
తరవాత అప్పుడప్పుడు బర్కిలీలోనూ, ఇక్కడ మాంటెరేలోనూ ఉంటున్నప్పుడు కూడా చిటుక్కున ఏదో ఆనందమయ స్థితిలో పడిపోతూ, నా శరీరం కూడా దానితో అతి తెలేలిక అయిపోయి ఉత్తేజంతో నిండిపొయేది.
ఇలాంటి అనుభవాలకు మనసు విలువగట్టి, వాటికోసం, వాటిని పునస్సృష్టించుకోవాలని ప్రాకులాడదం సహజమే. కాకపోతే, జే. కృష్ణమూర్తిగారు చెప్పినట్టుగా, వాటికోసం మనం ఎంత ప్రాకులాడుతామో అవి అంతగా దూరమైపోతాయి. మనసులోని తెరలు ఎందుకు తొలుగుతాయో మనకి తెలియదు; ఆ క్షణంలో ఏ ప్రత్యేకమైన కారణం లేకుండానే అది జరుగుతుంది. ఆ అనుభవాల్ని తిప్పి రప్పించుకోవాలనే ప్రయత్నం, దానికి మనమిచ్చే విలువా అన్ని గతానుభవ సంభూతమైనవే. ఆ గతం పనిచేస్తూన్నంత కాలమూ అవి మనకి అందకుండానే ఉంటాయి.
యూజీతో పరిచయమైన తరవాత నేను నేర్చుకున్న మొట్టమొదటి పాఠమిది: ఇలాంటి అనుభవాలూ, అనుభూతులూ అన్నీ మనో స్థితులు. అలోచనలూ, మనోభావాలూ, ఉద్రేకాల్లాగానే ఇవికూడా తాత్కాలికాలు. వాటికోసం పాకులాడుతూండడమే మనం అహాన్ని కొనసాగించుకునే ఒక మార్గం. వాటికి మనం ఇచ్చే విలువలతోనే మన అహం నిర్మాణం జరుగుతుంది. అనుభవాలకు విలువలేదు; అవి వస్తూనూ పోతూనూ ఉంటాయి. మానసిక స్థితులకన్నిటికీ అదే స్వభావం.
అందుకనే నేను తమ ఆధ్యాత్మికానుభవాల్ని గురించి నాతో చెప్పుకునే వారిని ఈ ప్రశ్న అడుగుతాను: ఆ అనుభవం తీరిపోయింతరవాత మీ గతి ఎమవుతుంది? మీరు మళ్ళా మాములు మనుషుల్లోపడి, మామూలు జీవితంలో, మామూలు ప్రపంచంలో ఉన్న కష్టనష్టాల్ని భరించాల్సిందే కదా? వాటిని తీర్చలేని ఈ అనుభవాలన్నీ తుచ్ఛమైనవి. నిజమైన విముక్తి అనేది ఉంటే అది ఈ దైనందిన జీవితంలో రావాలి; ఏదో ప్రత్యేక క్షణాల్లో కాదు.
అందుకే నా ఉద్దేశ్యంలో విముక్తి అనేది ఒక అనుభవం, అనుభూతి కానేరదు. జీవితాన్ని సంపూర్ణమైన పరిణామం వస్తేనే గాని అలాంటిదేదీ జరగదు.

9 Comments:
ఆదిరింది గురూగారూ టపా. నిజమే విముక్తి అనేది పూర్తిగా, సంపూర్ణంగా వుండాలి. ఈ రోజు వుండి రేపు వెళ్ళి పోయే గొప్ప అనుభవం, విముక్తీ సత్యాలు కానేరవు. ఈ సంపూర్ణ విముక్తి, సంపూర్ణ అనుభవాన్నే బహుశా మన పూర్వీకులు చిదానందం అన్నారు. ఆహ్లాదానికీ, శోకానికీ లొంగక పోవడం, ఎల్లవేళలా స్థితప్రజ్ఞత (బ్యాలెన్స్) కలిగివుండడం. లోకంలో దేన్ని చూసినా ఒకే విథమైన నిండు భావన కలిగివుండటం నిజమైన విముక్తి అనుకుంటా. మరి మీరేమంటారో?
మీ ప్రశ్నకి నా సమాధానం అంత తేలికగా, క్లుప్తంగా చెప్పగలిగేది కాదు. ఓపిక పట్టండి. నెమ్మదిగా కొద్దికొద్దిగా చదువుతున్నారు కదా! ఈ మధ్యలో ఆనందం అంటే ఎమిటి అనే ప్రశ్న అడుగుతాను నేనైతే. మనం అందరం సుఖంకోసం, ఆనందంకోసం పాకులాడుతాం. అంతా ప్రయత్నం చేసింతరవాత ఆ అనందం వచ్చింతరవాత నూటిలో పదోవంతుసమయం కూడా దాన్ని అనుభవించం. మన మనసు మరెక్కడికో, మరొ సుఖాన్ని అపేక్షిస్తూ పోతుంది. ఒకవేళ మనం అనుకోకుండానే ఏదో అనుభవంలో పూర్తిగా నిమగ్నులమైపోయామా, అది మనకు కలుగుతోందనే జ్ఞానమే ఉండదు. ఆ అనుభూతి మధ్యలో మనకి అనుభవిస్తున్నామనే ఎరిక కలిగందా, అది ఆ అనుభవానికి ఆటంకమై, ఎందుకు మనకు ఆ ఎరిక వచ్చిందా అని మన్ని మనమే నిందించుకోవడం జరుగుతుంది. ఆ ఎరిక పానకంలో పుడకై కూర్చుని, మన ఆనందాన్ని విషకలుషితం చేస్తుంది. మీరు అనే అనందం ఇలాంటిది కాకపోతే మరెలాంటిదై వుంటుంది?
అయ్యో మూర్తిగారూ - పెద్దవారు - మీరు కృతజ్ఞతలు చెప్పడమెందుకు...ఏదో నాకు తెలిసింది మీకు చెప్పాను...అసలు పని చేస్తున్నది మీరే కదా ...మీలాంటి పెద్దవారి అనుభవాలు, అభిప్రాయాలు ఇప్పటి చిన్నవాళ్ళకి ఒక పాఠం అవుతాయి...ఇలాగే రాస్తూ ఉండండి ...
మీరు చెప్పిందంతా నిజమే.అందుకే నేను ఆ పదాన్ని ఆనందం అని అనలేదు. ఆహ్లాదం అని పేరెట్టి, దానికీ శోకానికీ పెద్ద తేడా లేనట్టు చూపించాను. మీరన్నట్టు ఆనందంలో వున్నామన్న ఎరుగ కలిగిందా ఆ ఆనందం కాస్తా స్వాహా. ఇప్పటి దాకా నాకు తెలిసిన ఆనందం నిమగ్నమైనప్పుడు మనకి తెలీకుండా అనుభవించేదే. జె.కె. గారన్నట్టు నేను గతానికి దూరంగా, మనసును ఖాళీగా వుంచి, ఆలోచించకుండా కేవలం పరిశీలనతో, అనావరణమైన హృదయంతో ఉండలేక పోతున్నాను. కనుక, ఆయన చెప్పిన సత్యం తనకు తానుగా నన్ను చేరనూ లేదు(knocking the door స్థితి). అందువల్ల, ఇప్పటిదాకా నాకు తెలిసిన ఆనందం నిమగ్నమైనప్పుడు మనకి తెలీని స్థితే. మీరేమంటారో?
విజయకుమార్ గారూ:
మీరున్న స్థితిలోనించి మరోస్థితిలోకి (అది ఎంత గొప్పదనిపించినా) పోవడానికి మనసు తహతహలాడినంత కాలం మీకు ఆ స్థితి దూరంగానే ఉంటుంది. మీరున్న స్థితికీ మీకూ మధ్య ఉన్న విభేదంలో పుట్టిన ఆ తృష్ణ తృష్ణగానే ఉండిపోతుంది. ఆ భేదానికి కారణం మీరు గొప్పదనుకునే మరో స్థితికి విలువ ఇవ్వడం. మోక్షం, ముక్తి అనే భావాలు మనసు ఏర్పరచుకునే భ్రాంతులు. ఇదంతా మీకు గజిబిజిగా తోస్తే, మీరే అలోచించండి మీరున్నది కాని ఆ గొప్పస్థితి ఉన్నదని మీకెలా తెలుసు? కృష్ణమూర్తి గారో, మరొకరో, లేకపోతే భగవద్గీతో, చెప్పబట్టేకదా?
పైగా మీరు నిమగ్నమైపోయే అనందమో దుఃఖమో మీకు తెలియాలనే ఇచ్ఛ ఉంది కనుకనే నేను అనేది ప్రవేశించి దాన్ని కలుషితం చేస్తుంది. అయితే మనముండే స్థితి మనకెందుకు తెలియాలి? ఆ నేను అనేది ఉన్నంతకాలం మనకూ మనస్థితులకూ మధ్య విభేదం తప్పదు. ఆ నేనే ఈ స్థితిని మంచిదీ చెడ్డదీ అని విచక్షణ చేసి, ఆ స్థితి మంచిదనిపిస్తే దాన్ని కొనసాగించుకోవాలనో, అది మంచిదికాదూ, దుర్భరం అని నిర్ణయించుకుంటే, అదికాక మరో స్థితిలో ఉండాలనో కోరుతుంది. మనం నమ్మే విలువలతోనే ఈ నేను అనేది ఏర్పడుతుంది.
నిజమే మాష్టారూ. మీరు చెప్పిందంతా కలిపితే నేను. నాకూ మరో స్థితికోసం ప్రయత్నించకూడదని తెలుసు. అలా ఏ ప్రయత్నం లేకుండా జీవితం గడిపేస్తే, యిలాగే రోజులు గడిచిపోతున్నాయే రొటీన్ గా. ఈ భావనే మళ్ళీ Conflict లో పడేస్తోంది. అయినా, ఈ తృష్ణ వీడేదెప్పుడో అర్థం కావడంలా. ఏది మాట్లాడినా మళ్ళీ మొదటికే వస్తున్నాం. ఏం చెపుతారో మీ యిష్టం.
విజయకుమార్ గారూ:
రుటీన్ అనే మాటలోనే ఉంది చిక్కు. ఏవో గతంలోని మధుర స్మృతులతో పొలిస్తే తప్ప, ఈ 'రుటీను ' లో ఉన్న ఇబ్బంది ఏమిటి? ఒకమాటు ఈ ప్రస్తుత జీవితం శుష్కమైనదని నిర్ధారణ చేసుకున్న క్షణంలోనే, ఈ జీవితం దుర్భరమై మరో జీవితం కోసం అన్వేషణ ప్రారంభిస్తాం. ఇదంతా మీరు ఇదివరకు వినే ఉంటారు. జే.కృష్ణమూర్తి అన్నట్టు ఆ స్మృతులన్నీ ఇప్పుడు బూడిదా, ధూళీ. ఒకమాటు యూజీ నాతో గర్జిస్తూ అన్నారు: "This 'shit' is no shit, if you don't compare it with something else!"
ఈ జీవితనికీ, ఈ ప్రపంచానికీ మించి వేరే జీవితమూ, ప్రపంచమూ లేవేమో.
మాష్టారూ మీరు చెప్పిన ఈ Description అంతా మన కాకపోతే నా ఆలోచనకి అందుతూనే వుంది. ఈ జీవితానికి మించింది మరోటి లేదని నేను నా బ్లాగులో భావాతీతధ్యానం వ్యాసంలో రాసాను కూడా. అయినా, మీరన్నట్టు మరో ఉన్నతమైన స్థితి(కృష్టమూర్తి గారో మరోకరో చెప్పింది) వున్నదనే భావన, ఈ hope ని ఆలోచన విడిచిపెట్టడంలా. మీరన్నట్టే, ఈ జీవితానికీ, ఈ ప్రపంచానికీ మించి వేరే జీవితమూ, ప్రపంచమూ లేవేమో అనుకుంటే మళ్లీ నేను తిరిగి ప్రాపంచిక విషయాల్లో మునిగిపోతాను. డబ్బు సంపాదన, కుటుంబ సంక్షేమం, వ్యసనాలూ మళ్ళీ మొత్తం మామూలే. అప్పుడు మామూలు మనిషికీ, యిన్నేళ్ళు యింతటి అన్వేషణా చేసి యిన్ని విలువలు సాధించుకున్నవాడికీ వ్యత్యాసం ఏమిటి?
విజయ కుమార్ గారూ:
ప్రాపంచిక విషయాల్లో తిరిగి ముణిగిపోతేనేం? మీరు ఇన్నాళ్ళుగా సాధించుకున్నవి ఇప్పుడేం మిగిలినయ్యి? ఆ విలువల మీద నమ్మకాలనీ, ఆ ఆశలనీ పెట్టుకునే మీరు బతకాలి. అవేలేకపోతే మీరేమౌతారూ? అవి మీకు జీవితంలోని శూన్యతని పొడిచి పొడిచి చూపిస్తూనే ఉంటాయి. "పోయేనాడూ వెంబడిరాదూ పూచిక పుల్లైనా" అనేది గుర్తుందిగా?
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home